అద్భుతమైన పేర్లను మీ పిల్లల కోసం Telugu Baby Names Tool సహాయం తో చూడండి ❤️
తెలుగు శిశు పేర్ల జనరేటర్
అద్భుతమైన మరియు అర్థవంతమైన తెలుగు శిశు పేర్లను కనుగొనండి
మీ కోసం అందమైన పేర్లను సిద్ధం చేస్తున్నాము...
జనరేట్ చేయబడిన పేర్లు
నా ఇష్టమైన పేర్లు
ఎందుకు మా Telugu Baby Names Generating Tool ఉపయోగించాలి?
మీ పిల్లలు కోసం ఒక మంచి పేరు పెట్టాలనే మీ కోరికను దృష్టిలో పెట్టుకొని ఈ Tool ని తయారు చెయ్యడం జరిగింది. ఇందులో వేల సంఖ్యలో వివిధ రకాల తెలుగు పేర్లు ఇంకా వాటి అర్ధాలు ఉన్నాయి, ప్రతీ రోజు Tool లో కొత్తగా పేర్లు చేర్చడం జరుగుతుంది.
Tool ప్రత్యేకతలు ఏంటి?
మా Tool సహాయం తో సులభంగా పేర్లను తెలుసుకోవొచ్చు, మీరు వేల సంఖ్యలో ఉన్న పేర్లను వివిధ పేజీలలో చూడవచ్చు, అందువల్ల మీరు ఎటువంటి సమస్య లేకుండా ఒకే దగ్గర అన్ని పేర్లను చూడవచ్చు, దీనితో పాటు మీకు నచ్చిన పేర్లను ఇక్కడ సేవ్ చేసుకొని మీకు కావాల్సిన అప్పుడు మీ పేర్లను చూడవచ్చు ఇంకా కొత్తవి జత చెయ్యొచ్చు, పాతవి తీసివేయ్యవచ్చు. మీకు కావాల్సిన పేర్లను కనుగొనడానికి అక్షరం తో పేర్లను చూడవచ్చు.
ఎలాంటి పేర్లను ఎంచుకోవాలి?
పేరు అనేది జీవితంలో ఒకే సారి పెట్టుకుంటారు అందువల్ల పేరుని పెట్టేముందు వీటిని తప్పకుండ పరిగణలోకి తీసుకోవాలి.
1.పేరు మంచి అర్థం కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ప్రతి పేరుకు ఒక ప్రత్యేక అర్థం ఉండేలా చూసుకోవాలి.
2.పేరు ఉచ్చరించడానికి మరియు రాయడానికి సులభంగా ఉండాలి. మరీ క్లిష్టమైన పేర్లు పిల్లల జీవితంలో అనవసర చికాకులు తెచ్చిపెట్టవచ్చు.
3.కొన్ని కుటుంబాల్లో పురాణపురుషుల పేర్లను కొనసాగించడం, పెద్దవాళ్లు సూచించిన పేర్లను తీసుకోవడం వంటి సంప్రదాయాలు ఉంటాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
4.కొంతమంది తల్లిదండ్రులు ఆధునిక ధోరణిలో ప్రత్యేకమైన, స్టైలిష్ పేర్లు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో నూతన పేర్లు లేదా ఇతర భాషల నుండి స్ఫూర్తి పొందిన పేర్లు కూడా ఎంపిక చేయవచ్చు.
5.పురాణ విశ్వాసాల ప్రకారం, శుభమైన రాశి అక్షరాలతో పేరు పెడితే శ్రేయస్సు అని నమ్మకం ఉంది.
6.పిల్లగా ఉండగా, టీనేజర్‌గా మరియు పెద్దవాడయ్యాక కూడా ఆ పేరు తగినట్లుగా ఉండాలి. చిన్ననాటి ముద్దు పేరుగా సరిపోయినా,తర్వాత పెద్దవాడయ్యాక కూడా ఆ పేరు గౌరవప్రదంగా అనిపించాలి.
పిల్లల పేరు ఎంపిక ఒక అందమైన ప్రయాణం. అది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, మీ బిడ్డకు జీవితాంతం గుర్తింపు కలిగించే గుర్తు.అందువల్ల తొందర పడకుండా ప్రేమతో ఓపికతో ఎంచుకోండి,